TANUKU-INFO

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్..

తణుకు: గత ఏడాది అక్టోబర్‌లో తణుకు ఉండ్రాజవరం రోడ్డులో 5 కిలోల గంజాయి రవాణా కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పోలవరపు కుమార శివ (21)ను తణుకు ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. మండపాక గ్రామానికి చెందిన అతడు ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తణుకు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎక్సైజ్ అధికారులు, అనుమానాస్పద సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Posted on 11-06-2026 05:56 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠