పోలియో రహిత సమాజమే లక్ష్యం..
తణుకు: పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. దేశం 2014లో పోలియో రహితంగా గుర్తింపు పొందినప్పటికీ పొరుగు దేశాల్లో ఇంకా కేసులు నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. గత 15 ఏళ్లుగా జిల్లాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడం ప్రజల సహకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన, అంగవైకల్య రహిత సమాజ నిర్మాణానికి పోలియో చుక్కలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వైద్య, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Posted on 28-06-2026 12:55 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


