TANUKU-INFO

అమరావతి శాశ్వత రాజధాని: కూటమి సంబరాలు..

తణుకు: అమరావతి శాశ్వత రాజధానిగా చారిత్రాత్మకంగా నిలిచిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో, ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతి గెజిట్ రావడం హర్షణీయమన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చిన త్యాగాలకు న్యాయం జరిగిందన్నారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేశారని విమర్శించారు. పార్లమెంటులో 49 పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. తణుకులో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. మీడియాపై దాడులను ఖండించారు.

Posted on 07-04-2026 07:38 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠