వైసీపీపై మంత్రి నిమ్మల విమర్శలు..
తణుకు: వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వెనక్కు నెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తణుకు మండలం దువ్వ, ముద్దాపురంలో రూ.7.63 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రక్షాళనపై దృష్టి పెట్టిందన్నారు. ధాన్యానికి 24 గంటల్లో చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Posted on 12-04-2026 07:23 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
