TANUKU-INFO

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం..

తణుకు: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ, సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ మంత్రులు, అధికారులను ఘటనాస్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధిత కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Posted on 09-06-2026 06:42 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠