ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎమ్మెల్యే..
తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ పర్యటన సందర్భంగా రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో సమావేశమయ్యారు. జోనల్ ఇన్‌చార్జ్ ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ హోలీపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు.
Posted on 08-06-2026 04:25 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers



