TANUKU-INFO

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ పథకం ప్రారంభం..

ప.గో జిల్లా,తణుకు: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇరగవరం మండలం కె.ఇల్లింద్రపర్రులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించే సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని ప్రారంభించారు. రూ.1.20 లక్షల విలువైన యూనిట్లు ఉచితంగా అందించి, అదనపు విద్యుత్తును ప్రభుత్వానికి ఇచ్చే విధానం అమలు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో 7664 కుటుంబాలను గుర్తించి, మొదటి దశలో 3500 కుటుంబాలకు లబ్ధి కల్పిస్తామని, రూ.36 కోట్ల ప్రాజెక్టు అమలవుతోందన్నారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Posted on 05-04-2026 07:41 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠