TANUKU-INFO

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం..

పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 150 మంది కార్మికులకు మూడు రోజులపాటు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Posted on 20-05-2026 02:03 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠