పోలీసుల దాడితో ఆత్మహత్యాయత్నం..
తణుకు, ప.గో. జిల్లా: నిడమర్రుకు చెందిన నండూరి శివ కార్తికేయ తనను నిడమర్రు ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కొట్టడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని ఆరోపించారు. కుటుంబ ఘర్షణల నేపథ్యంలో ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తన ఫిర్యాదును నమోదు చేయకపోవడమే కాక, తనపై దాడి చేశారని ఆయన మీడియాకు తెలిపారు.
గత రెండు రోజులుగా తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ కార్తికేయ ప్రస్తుతం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆస్పత్రి వద్ద సీఐతో పాటు ఎస్‌ఐ, ఇతర పోలీసులు పహారా కాస్తున్నారు.
బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను విజయవాడకు తరలించాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. మీడియాను లోపలికి అనుమతించకుండా అడ్డుకుంటున్న పోలీసులు..
Posted on 02-04-2026 09:55 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
