TANUKU-INFO

ఇంధన ధరల పెరుగుదలపై వైఎస్ఆర్‌సీపీ వినూత్న నిరసన..

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తణుకులో ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లతో వినూత్న నిరసన చేపట్టి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్ర, వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted on 18-05-2026 12:24 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠