TANUKU-INFO

సీఎంను కలిసిన ఎమ్మెల్యే: అభివృద్ధి నిధులపై మంత్రులతో చర్చలు..

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డిని కలసి తణుకు అభివృద్ధికి అవసరమైన నిధులు, పనులపై చర్చించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Posted on 10-04-2026 06:13 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠