TANUKU-INFO

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తణుకు కోర్టు భవన సముదాయంలో గౌరవ చైర్మన్, నాలుగవ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. స్వర్ణ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మొక్కలు నాటడం రాజ్యాంగబద్ధ కర్తవ్యాల్లో భాగమని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతలు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Posted on 05-06-2026 12:40 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠