TANUKU-INFO

వరుస ఆత్మహత్యలు కలకలం..

తణుకు పట్టణంలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల పైడిపర్రులో వివాహిత అనుమోలు దేవి (31) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే, పాత ఊరు ఐదో వార్డు వెల్దుర్తివారి వీధిలో మర్రాపు సాంబశివరావు (50) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వరుస ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ఆత్మహత్యలకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Posted on 21-04-2026 01:43 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠