పాత కక్షల ఘర్షణ., ఒకరి మృతి..
తణుకు పట్టణంలోని పాతవూరు ఎస్సీ పేటలో ఆదివారం రాత్రి పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఉందుర్తి ఎలీషా అలియాస్ అబ్బులు (30) మృతి చెందగా, అతని సోదరులు ఉందుర్తి చిన్న, ఉందుర్తి పండులకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లిపూడి శశి, ప్రదీప్, చందు, బొత్స లోకేష్ తమపై కత్తులు, బీరు బాటిళ్లతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ డి. విశ్వనాథ్, సీఐలు డి. వెంకటేశ్వరరావు, జేవీ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు తణుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Posted on 31-05-2026 10:42 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
