రూ.7.63 కోట్ల పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన..
తణుకు నియోజకవర్గంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. తణుకు మండలం ముద్దాపురం, దువ్వ గ్రామాల్లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని రూ.7.63 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 12-04-2026 05:37 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
