TANUKU-INFO

మహిళా సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం: వైఎస్ఆర్‌సీపీ

తణుకు: రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆరోపించారు. తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా విభాగం సమావేశంలో మహిళా విభాగం అధ్యక్షురాలు మెహర్ ఆన్సరి మాట్లాడుతూ, ఎన్నికల హామీలైన ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళల భద్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. సమావేశంలో పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

Posted on 08-06-2026 05:38 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠