TANUKU-INFO

ఎన్టీఆర్ పార్కు అభివృద్ధికి శ్రీకారం..

తణుకులో ఎన్టీఆర్ పార్కును దశలవారీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో పార్కును ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టగా, మొదటి దశలో రూ.94.50 లక్షలతో పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ఈ అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల భాగంగా సూచనలు అమలు చేస్తున్నామని తెలిపారు. తణుకులో సుమారు 25 పార్కులను అభివృద్ధి చేసి యువత, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Posted on 05-04-2026 06:39 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠