రక్తదాతల దినోత్సవంలో ప్రాణదాతలకు ఘన సన్మానం..
తణుకు: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తణుకు బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రక్తదాన సేవలను ప్రోత్సహిస్తూ పలువురు దాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొలగాని సత్యనారాయణ (రాజా) 109 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి అందించిన సేవలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్న రోగులకు రక్తదాతలే ప్రాణదాతలని నిర్వాహకులు పేర్కొన్నారు. రక్తదానం వల్ల ఒకేసారి పలువురి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని చెబుతూ, యువతతో పాటు ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Posted on 14-06-2026 06:23 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
