వైసీపీ విమర్శలు హాస్యాస్పదం: రాధాకృష్ణ..
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అధిక మొత్తంలో ఇంధనం దిగుమతి చేసుకునే భారత్ క్రూడ్ ఆయిల్ సమస్యను ఎదుర్కొంటోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఖాళీ గ్యాస్ బండ్లు, గుర్రాలు, ఎద్దులతో నిరసనలు చేయడం హాస్యాస్పదమన్నారు. గత వైసీపీ పాలనలోనే ఇంధన ధరలు భారీగా పెరిగాయని, రోడ్డు సెస్సు పేరుతో ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో కేంద్రం లీటరుకు రూ.3 పెంచిందని తెలిపారు, ఇంధన పొదుపుపై ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని కోరారు.
Posted on 18-05-2026 05:49 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
