అమరావతి బిల్లుకు ఆమోదం: తణుకులో సంబరాలు..
అమరావతి రాజధానికి లోక్‌సభ, రాజ్యసభల్లో చట్టబద్ధత లభించడంతో తణుకు నియోజకవర్గంలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు నరేంద్ర సెంటర్‌లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణం నిర్లక్ష్యం చేశారు అని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
Posted on 02-04-2026 10:44 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
