TANUKU-INFO

ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానుల రక్తదాన శిబిరం..

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడే సేవ చేస్తున్నారని అభిమానులను అభినందించారు. జూనియర్ ఎన్టీఆర్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నందమూరి కుటుంబం సేవారంగంలో, సినీరంగంలో చెరగని ముద్ర వేసిందన్నారు. కార్యక్రమంలో అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Posted on 20-05-2026 01:30 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠