TANUKU-INFO

పల్స్ పోలియో మహాయజ్ఞం..

తణుకు: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం కోసం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ టి. రామ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. పట్టణంలో 51 పోలియో చుక్కల కేంద్రాలు, 2 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా నవజాత శిశువుల నుంచి ఐదేళ్లలోపు 6,976 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద శానిటేషన్, తాగునీరు, ప్రచార కార్యక్రమాలు, సిబ్బంది ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. సమావేశంలో ఎంపీడీవో జి. శ్రీనివాసరావు, వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Posted on 23-06-2026 03:36 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠