TANUKU-INFO

రూ.3 కోట్లతో రోడ్ల నిర్మాణం..

తణుకు మున్సిపల్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇరగవరం రోడ్డుమీదుగా కొండాలమ్మ గుడి వరకు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఇరగవరం కాలనీ వరకు సీసీ రోడ్డు, అక్కడి నుంచి బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన ఎమ్మెల్యే, ఎన్నికల హామీల మేరకు నియోజకవర్గంలో భారీ స్థాయిలో రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Posted on 26-06-2026 07:20 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠