TANUKU-INFO

ఇంధన కొరతకు ప్రభుత్వ వైఫల్యమే కారణం: కారుమూరి.

తణుకు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు చంద్రబాబు ప్రభుత్వం అసమర్థ పాలనే కారణమని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. కమర్షియల్ బల్క్ డీజిల్‌ను రిటైల్ బంక్‌లలో విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో కృత్రిమ కొరత ఏర్పడిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో సమస్య లేకపోయినా ఏపీలో 70 శాతం బంక్‌లలో “నో స్టాక్” బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్నిచోట్ల రేషన్ విధానంలో ఇంధనం ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు కేంద్ర పెట్రోలియం శాఖకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే సర్క్యులర్ ఉపసంహరించి సాధారణ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Posted on 29-04-2026 07:52 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠