TANUKU-INFO

జూలై 11న జాతీయ లోక్ అదాలత్..

తణుకు: జూలై నెల 11న (రెండో శనివారం) తణుకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ శ్రీమతి సుంకర శ్రీదేవి తెలిపారు. రాజీ పడే క్రిమినల్, ఎక్సైజ్, కుటుంబ, భార్యాభర్తల వివాదాలు, చెక్ బౌన్స్, సివిల్, మోటారు ప్రమాద పరిహారం, ప్రీ లిటిగేషన్ బ్యాంకు రుణాలు, టెలిఫోన్ బకాయిలు, బెంచ్ కోర్టు న్యూసెన్స్ కేసులు తదితరాలను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. పోలీసు అధికారులు ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీ ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలని, మీడియా విస్తృత ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Posted on 24-06-2026 12:10 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠