TANUKU-INFO

మాజీ మంత్రి కారుమూరి కుటుంబానికి ఈడీ షాక్..

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల కారుమూరి కుటుంబానికి చెందిన నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టవగా, తాజా అరెస్టుతో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది.

Posted on 18-06-2026 04:14 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠