పోలియో రహిత లక్ష్యంగా 24,611 మంది చిన్నారులకు పోలియో చుక్కలు..
తణుకు: పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తణుకు మున్సిపాలిటీతో పాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని 174 కేంద్రాల ద్వారా 24,611 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. నాలుగు ట్రాన్సిట్ కేంద్రాలు, ఎనిమిది మొబైల్ బృందాలతో 784 మంది సిబ్బంది సేవలందిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’ పథకం అమలు చేసి ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా నిర్వహించి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.
Posted on 28-06-2026 11:42 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


