టిడ్కో ఇళ్ల పునర్నిర్మాణానికి శ్రీకారం..
తణుకు: గత వైసీపీ పాలనలో టిడ్కో ఇళ్లు నిర్లక్ష్యానికి గురై పేదలకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తణుకులో టిడ్కో గృహ సముదాయంలో సంపు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2014–19లో రూ.73 కోట్లతో 912 మంది లబ్ధిదారుల కోసం ఇళ్లు నిర్మించగా, వైసీపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ నిర్మాణాలు ప్రారంభించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలతో పనులు వేగవంతం చేస్తోందని తెలిపారు. త్వరలోనే ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Posted on 19-05-2026 12:07 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
