ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు డిమాండ్‌తో వైఎస్ఆర్‌సీపీ నిరసన..
తణుకు: ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నాయకుల భార్యలను కించపరుస్తూ వీకెండ్ కామెంట్‌లో ప్రసారం చేసిన కథనాలను ఖండించారు. గురువారం వైఎస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో తణుకు టౌన్, రూరల్, అత్తిలి, ఇరగవరం పోలీస్ స్టేషన్లలో వినతిపత్రాలు సమర్పించి రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లీగల్ సెల్ నాయకుడు సాయిబాబా మాట్లాడుతూ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని, జర్నలిజం విలువలను దిగజార్చేలా ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 10-04-2026 03:29 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
