TANUKU-INFO

యాంటీ డ్రగ్ కమిటీలను పునరుద్ధరించి..

డ్రగ్స్, గంజాయి రహిత విద్యాసంస్థలే లక్ష్యంగా తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం నివారణపై యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థులు కళాశాల లోపల లేదా బయట డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ఇందుకోసం అధికారుల సంప్రదింపు వివరాలు అందజేశారు. కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను పునరుద్ధరించి, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని సూచించగా, పూర్తి సహకారం అందిస్తామని ఎక్సైజ్ శాఖ హామీ ఇచ్చింది. కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ సత్తి మణికంఠ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎన్. తులసి రాధా, వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు పాల్గొన్నారు.

Posted on 20-06-2026 07:26 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠