TANUKU-INFO

ఐదేళ్లు వెన్నుపోటు., రెండేళ్లు అభివృద్ధి: వైసీపీపై ఎమ్మెల్యే విమర్శలు

తణుకు: వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని, రాష్ట్రంలో వెన్నుపోట్లకు సర్వహక్కులు జగన్‌మోహన్‌రెడ్డివైతే తణుకులో కారుమూరి నాగేశ్వరరావువని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తణుకు కూటమి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని పేర్కొన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో తణుకు నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి విజయాన్ని సాధిస్తామని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

Posted on 13-06-2026 06:23 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠