NEET పరీక్షకు సర్వం సిద్ధం..
ప.గో జిల్లా : ఈరోజు నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. విద్య, పోలీస్, వైద్య, రవాణా శాఖల సమన్వయంతో పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా మధ్యాహ్నం 1:30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని సూచిస్తూ, పరీక్ష నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.
Posted on 21-06-2026 08:33 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
