తణుకులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..
తణుకులో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని ఆయన తెలిపారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసారని పేర్కొన్నారు. ఐటి విప్లవం, విజన్ 2020 ద్వారా యువతకు మార్గదర్శకుడయ్యారని అన్నారు. ఈ సందర్భంగా తోపుడు బండ్లు, ఎగ్ కార్డులు పంపిణీ చేసి, ఆసుపత్రిలో పండ్లు పంచారు. అన్న క్యాంటీన్లో ఉచిత భోజనం ఏర్పాటు చేసి భోజనం చేశారు,. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Posted on 20-04-2026 02:46 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
