ఏరువాక పౌర్ణమితో రైతాంగానికి నూతనోత్సాహం..
తణుకు: మండపాకలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి రాష్ట్ర పండుగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని భూమి, నాగలి, ఎడ్ల పూజలు నిర్వహించి దుక్కి దున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతాంగానికి గౌరవ సూచకంగా ఏరువాక పౌర్ణమిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 13 లక్షల మెట్రిక్ టన్నులు, తణుకు నియోజకవర్గంలో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.1,030 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, యూరియా సరఫరా, డ్రోన్ల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, సాగునీటి సదుపాయాల ద్వారా రైతులకు మరింత భరోసా కల్పిస్తున్నామని, సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Posted on 29-06-2026 03:46 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers

