TANUKU-INFO

ధ్యానం, శాఖాహారంతో శాంతియుత సమాజ నిర్మాణం..

తణుకు: ప్రపంచ ధ్యాన మహాసభల సందర్భంగా తణుకు పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాఖాహార, ధ్యాన అవగాహన మహా ర్యాలీని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడేందుకు ధ్యానం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అహింస, శాఖాహారం, ధ్యానం ద్వారా శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. పత్రీజీ చూపిన మార్గం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని, తణుకు పిరమిడ్ కేంద్రం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు.

Posted on 18-06-2026 05:21 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠