ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..
తణుకు: జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా తణుకు పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జరిగిన సభలో మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ‘సత్యశోధక సమాజ్’ స్థాపించి మార్పు తీసుకువచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీల అభివృద్ధికి పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Posted on 11-04-2026 12:00 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
