TANUKU-INFO

వేల్పూరులో రాజయోగ ఓం శాంతి కేంద్రం ప్రారంభం..

తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రాజయోగ ఓం శాంతి కేంద్రం (ఓం శాంతి భవనం)ను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక సాధనకు అవకాశం కలుగుతుందని చెప్పారు. గ్రామంలో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని సూచించారు. వేల్పూరు భక్తి వాతావరణం పరిసర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు, నాయకులు పాల్గొన్నారు.

Posted on 12-04-2026 07:27 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠