బైక్‌ను ఢీకొన్న కారు, వ్యక్తి మృతి..
తణుకు: సర్మిస్ట సెంటర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న నేషనల్ హైవే కి సంబంధించిన స్కార్పియో వాహనం బైక్‌ను వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది . ఈ ఘటనలో చివటం గ్రామానికి చెందిన అడపా సత్యనారాయణ (48) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Posted on 26-04-2026 09:33 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers
