TANUKU-INFO

హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్..

తణుకు: పాతూరు అరుంధతి పేటలో మే 31న జరిగిన ఎలీషా అలియాస్ అబ్బులు హత్య కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ డి. విశ్వనాథ్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో మల్లిపూడి ప్రదీప్, శశికుమార్, లోకేశ్వరరావు, ఓ మైనర్ బాలుడు కత్తులు, బీరు సీసాలతో దాడి చేయగా ఎలీషా మృతి చెందినట్లు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు,. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

Posted on 03-06-2026 06:17 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠