TANUKU-INFO

ఎండాకాలంలో మానవ నిర్లక్ష్యానికి బలవుతున్న మూగజీవాలు..

తణుకు: మండుతున్న ఎండల్లో చల్లని నీడ కోసం కార్లు, భారీ వాహనాలు కింద ఆశ్రయం తీసుకుంటున్న కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనాలు స్టార్ట్ చేసే ముందు కింద పరిశీలించకపోవడంతో అనేక చోట్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కార్ కింద పడుకున్న ఓ చిన్న కుక్కపిల్ల యజమాని నిర్లక్ష్యంతో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. ఎండాకాలంలో వాహనాలు కదిలించే ముందు ఒక్కసారి పరిశీలిస్తే ఇలాంటి విషాదాలను నివారించవచ్చని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. మూగజీవాల ప్రాణాల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Posted on 23-05-2026 06:57 PM | by Kalyan
View Latest Deals & Offers
🏠